Wednesday, January 22, 2025

ఈ 10 ఫుడ్స్ తీసుకుంటే అలసట, నిస్సత్తువ మటుమాయం!

Must Read

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అవసరమైన పోషకాలు శరీరంలో తగిన పాళ్లలో ఉండాల్సిందే. అలాంటి వాటిల్లో మెగ్నీషియం కూడా ఒకటి. శరీర సమతుల్యతను కాపాడటంతో పాటు కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాంటి సిగ్నల్స్ లో ఒకటి కండరాలు పట్టేయడం.

కండరాల ఆరోగ్యంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం కనుక లోపిస్తే తరచూ కండరాలు పట్టేస్తాయి. దీనివల్ల ఒక్కోసారి ఝలక్ లు కూడా వస్తుంటాయి. మెగ్నీషియం లోపం వల్ల శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. తరచూ అలసటకు గురైనట్లు కనిపిస్తారు. ఏ పని చేయాలన్నా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. మెగ్నీషియం లోపం కారణంగా వికారం, జీర్ణ సంబంధిత సమస్యలు, తిమ్మిర్లు, ఆకలి తగ్గడం లాంటివి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెగ్నీషియం అధికంగా లభించే ఆహారాలు తీసుకుంటే దీని నుంచి బయట పడొచ్చని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అవకాడో
శరీరానికి మేలు చేసే అవసరమైన కొవ్వులు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడంలో దోహదపడాయి. అలాగే వాపు, మంట లాంటి సమస్యలకు చెక్ పెట్టడంలోనూ సాయపడతాయి.

అరటి పండ్లు
అరటి పండ్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బాడీకి తక్షణమే ఎనర్జీ ఇవ్వడానికి ఇవి దోహదపడతాయి. అరటి పళ్లలో ఉండే మెగ్నీషియం, విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పాలకూర
మెగ్నీషియం ఎక్కువగా ఉండే కూరగాయల్లో పాలకూర ఒకటి. ఇందులో మెగ్నీషియంతో పాటు ప్రొటీన్, ఫైబర్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.

బొప్పాయి
మెగ్నీషియం అధిక మొత్తంలో ఉండే వాటిల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా జీర్ణశక్తిని రెట్టింపు చేయడంలోనూ ఇది దోహదపడుతుంది.

క్వినోవా
హెల్తీగా బరువు తగ్గేందుకు క్వినోవా బాగా సాయపడుతుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం శరీర జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

గింజలు
బాదం, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ ను తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో ఉండే ఫైబర్, మిగతా పోషకాలు జీర్ణశక్తిని మెరుగుపర్చడంతో పాటు బలాన్ని ఇస్తాయి.

సోయా బీన్స్
ఒక కప్పు సోయా బీన్స్ లో 166 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే సోయా బీన్స్ మీకు మంచి ఎంపికని చెప్పొచ్చు. ఇందులో మెగ్నీషియంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా అధిక మోతాదులో ఉంటాయి.

గుమ్మడి గింజలు
మెగ్నీషియం లోపంతో బాధపడే వారికి గుమ్మడికాయ గింజలు బాగా దోహదపడతాయి. ఓ కప్పు గుమ్మడి గింజల్లో 253 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. వీటిల్లో శరీరానికి మేలు చేసే ప్రొటీన్, పొటాషియం, ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటాయి.

డార్క్ చాక్లెట్
చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని, పళ్లు పుచ్చిపోతాయని డాక్టర్లు అంటుంటారు. ఇది నిజమే, కానీ వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మెగ్నీషియం లోపంతో బాధపడే వారికి ఎంతో సాయపడుతుంది. ఒక డార్క్ చాక్లెట్ లో 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

చియా గింజలు
మెగ్నీషియం మెండుగా కలిగిన మరో ఆహార పదార్థమే చియా గింజలు. కప్పు చియా గింజల్లో 111 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇందులో ఫైబర్ లెవల్స్ కూడా అధికంగానే ఉంటాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జీతం ఎంతో తెలుసా!

అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండో సారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ఉండే వారికి ఏటా 4లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -