Tuesday, December 3, 2024

మీతో మీరు సంతోషంగా ఉండేందుకు 10 చిట్కాలు!

By placing self-care, appreciation, and significant connections at the forefront, you can establish the groundwork for a happier and more satisfying existence.

Must Read

బిజీ లైఫ్లో పడి అందరూ సంతోషం అనే పదానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పొద్దున లేస్తే ఉద్యోగం, వ్యాపారం అంటూ తెగ బిజీ అయిపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా కుదరట్లేదు. ఆరోగ్యం కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. జాబ్, బిజినెస్ గోలలో పడి ఆనందం, సంతోషానికి దూరమైపోతున్నారు. మిగిలిన వారితో పక్కనబెడితే కనీసం తమతో తాము కూడా సంతోషంగా ఉండాలనే స్పృహ ఎవరిలోనూ కనిపించడం లేదు. కానీ శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమనేది అందరూ అర్థం చేసుకోవాలి. అందుకోసం ఎవరికి వారు కొంత సమయం ఏకాంతంగా గడపాలి.

లైఫ్లో పెద్ద మార్పులేవీ అకస్మాత్తుగా రావు. హెల్త్ విషయంలోనూ అంతే. ఆరోగ్యంపై స్పృహతో తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా మిమ్మల్ని ఎక్కువ కాలం చురుగ్గా ఉంచుతాయి. చాన్నాళ్ల వరకు అనారోగ్యం బారిన పడకుండా జీవించేలా చేస్తాయి. చాలా మంది ఏదో సాధించాలని గోల్స్ పెట్టుకుంటారు. ఫలానా పొజిషన్ కు చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఏదో సాధిస్తే సంతోషంగా ఉంటామని అనుకుంటారు. కానీ వ్యక్తిగత ఆనందానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. సంతోషం అనేది బయట ఎక్కడో లేదు.. అది మన లోపలే దాగి ఉందని గ్రహించరు. మన లోలోపల దాగి ఉన్న ఆనందపు ద్వారాలను ఎలా తెరవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కృతజ్ఞత

కృతజ్ఞత

ఇప్పటివరకు మీ జీవితంలో మీకు దక్కిన వాటన్నింటికీ మీరు కృతజ్ఞులై ఉండాలి. మీ దగ్గర ఉన్న ప్రతి దానికీ థ్యాంక్స్ చెప్పడం అలవర్చుకోండి. దీని వల్ల మీ లైఫ్ లో ఏది లేదో దాని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు.

ధ్యానం

ధ్యానం

మీ కోసం మీరు రోజూ ప్రత్యేక సమయం కేటాయించుకోండి. ఆ టైమ్ లో కొంత సేపు ధ్యానం చేయండి. మీ బాధలు, కష్టాలు, ఆలోచనలు, భావోద్వేగాలను పక్కన పెట్టి శ్రద్ధగా ధ్యానం చేయండి. ఇది మీలో ఉండే ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

లక్ష్యాలు

లక్ష్యాలు

మీరు ప్రతిదీ సాధించగలమనే ఆలోచనను పక్కన పెట్టండి. సాధ్యమయ్యే లక్ష్యాల్ని నిర్దేశించుకొని అందుకు తగ్గట్లు నిరంతరం శ్రమించండి. టార్గెట్ మీద ఫోకస్ పెట్టి పనిచేయండి. మీరు సాధించాలనుకునే లక్ష్యాల్లో విలువలు ఉండేలా చూసుకోండి.

కరుణ

కరుణ

మీపై మీరు కరుణ, దయతో ఉండండి. మీరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ భూమ్మీద ఏ వ్యక్తి కూడా అన్నింటా పర్ఫెక్ట్ అయి ఉండడని గ్రహించండి. తప్పులు చేయడం అనేది మానవ సహజం. మిమ్మల్ని మీరు ఎలా గౌరవించుకుంటారో అలాగే ఇతరులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మిగిలిన వారిని కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

బంధాలు

బంధాలు

మనిషి సంఘ జీవి అని పెద్దలు అంటుంటారు. ఒక్కరమే ఈ సమాజంలో బతకలేం. కుటుంబం, స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అంటూ చాలా మందితో కలసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి బంధాలకు ఉన్న విలువను గుర్తించి అందరితోనూ సౌమ్యంగా, ప్రేమగా మెలగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బంధాలను వదులుకోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నించండి.

ప్రస్తుతంలో జీవించు

ప్రస్తుతంలో జీవించు

గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోందనే విషయాలను పక్కన పెట్టి.. వర్తమానం మీద దృష్టి పెట్టండి. ప్రస్తుతంలో జీవించేందుకు ప్రయత్నించండి.

కంగారొద్దు

కంగారొద్దు

ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని అనవసరంగా కంగారు పడటం, ఒత్తిడి పెంచుకోవడం తగ్గించండి. జీవితంలో విషయాలను సింపుల్ గా ఉంచేందుకు ప్రయత్నించండి. తద్వారా సంతోషంగా ఉండగలరు.

ఆరోగ్యం

మానసిక, శారీరక ఆరోగ్యంపై ఫోకస్ చేయండి. తరచూ వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోండి.

సాయం

సాయం

ఇతరులకు సాయం చేయడంలోనే అసలైన ఆనందం దాగి ఉంది. కాబట్టి మీకు తోచినంతగా మిగిలిన వారికి హెల్ప్ చేయండి. కుదిరితే సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాలంటీర్లుగా పనిచేయండి. తద్వారా మీ లోలోపల మరింత సంతోషం వికసించడాన్ని గమనిస్తారు.

అభిరుచులు

అభిరుచులు

మీకు నచ్చే, మీలో ఆసక్తిని పెంచే అలవాట్లు, అభిరుచుల్ని ఎంచుకోండి. రోజూ వాటి కోసం కొంత సమయం కేటాయించాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. దీని వల్ల మీరు మరింత చురుగ్గా, సంతోషంగా ఉండగలరని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కానిస్టేబుల్ అక్కను చంపిన సొంత తమ్ముడు!

ఇబ్రహీంపట్నంలో దారుణం సొంత అక్క అని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.....
- Advertisement -

More Articles Like This

- Advertisement -