Thursday, September 19, 2024

COVID టైమ్‌లో మాస్క్ వద్దంటూ ఉద్యమం.. ఎందుకంటే?

Must Read

ఫేస్ మాస్క్.. ఈ పదం వింటే అందరికీ వెంటనే కొవిడ్ గుర్తుకొస్తుంది. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని అప్పట్లో అన్ని దేశాలు షరతులు విధించడం గుర్తుండే ఉంటుంది. అయితే ఒకప్పుడు వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రమే ఫేస్ మాస్క్ లు వాడేవారు. అలాగే రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు మాస్క్ లు కట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్పేవారు. అయితే కరోనా విజృంభణతో ఫేస్ మాస్క్ లను అందరూ వాడాలంటూ ప్రభుత్వాలు పలు మార్గదర్శకాలు తీసుకొచ్చాయి.

కరోనా సోకిన వారి నుంచి ఇతరులకు వైరస్ ప్రసారం కాకుండా ఫేస్ మాస్క్ లు ఉపయోగించాలని డాక్టర్స్ సూచించడం తెలిసిందే. అయితే కొవిడ్-19 వ్యాప్తి మొదలైన కొత్తలో చాలా మంది మాస్క్ వేసుకునేందుకు తిరస్కరించారని తెలుసా? అవును, 2021లో లండన్లోని అనేక మంది ప్రజలు మాస్క్ ధరించేందుకు నో చెప్పారు. మాస్క్ వేసుకోవాలా? మేం వేసుకోం? అంటూ చాలా మంది ససేమిరా అన్నారు. ఒక్క లండన్ లోనే కాదు యూరప్ లోని చాలా దేశాల్లో ఇదే పరిస్థితి.  

కరోనా భయంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. అయితే లండన్ సహా చాలా నగరాల్లోని ప్రజలు లాక్ డౌన్ ను వ్యతిరేకించడం గమనార్హం. పలు ఏరియాల్లో జనాలు రోడ్ల మీదకు భారీగా  వచ్చి మాస్క్ వేసుకోబోమని.. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన, ఉద్యమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా కాలంలో మాస్క్ ల విషయంలో తాను చూసిన పలు ఘటనల గురించి ఒక ఆస్ట్రేలియా ఆంథ్రపాలజిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎందుకు వ్యతిరేకించారంటే..
‘అప్పట్లో మాస్క్ లు ధరించేందుకు ప్రజలు ససేమిరా అన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడేందుకు మాస్క్ లు ఇబ్బందిగా అనిపించడమే దానికి కారణం. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తడం కూడా దీనికి మరో కారణం. మాస్క్ వేసుకుంటే ఇతరుల మాటలు సరిగ్గా వినబడేవి కాదని ఎక్కువ మంది చెప్పేవారు. ముఖ్యంగా లిప్ రీడింగ్ మీద ఆధారపడిన వారికి ఎదుటి వారు మాస్క్ వేసుకొని మాట్లాడితే వాళ్లు ఏం చెబుతున్నారో అస్సలు అర్థమయ్యేది కాదు’ అని ఆస్ట్రేలియాలోని టాస్మానియా యూనివర్సిటీలో మెడికల్ ఆంథ్రపాలజిస్ట్ గా ఉన్న డారిల్ స్టెల్ మాచ్ చెప్పుకొచ్చారు.

ఊపందుకున్న నినాదాలు
కరోనా వ్యాప్తి పెరిగాక లక్షల కొద్దీ కేసులు రావడంతో మాస్క్ లు వద్దన్న వారు క్రమంగా తగ్గిపోయారు. అయితే ఎప్పుడైతే కొవిడ్ ను తరిమికొట్టే వ్యాక్సిన్ లు వచ్చాయో అప్పుడు మాస్క్ లు వద్దనే నినాదాలు మళ్లీ ఊపందుకున్నాయి. అసలు విదేశాల్లోని ప్రజలు మాస్క్ లు వద్దనడానికి కారణాలు ఏంటనే దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మాస్క్ లు తప్పనిసరి చేసిన టైమ్ లో ఆస్పత్రుల్లో రోగుల కుటుంబీకులు, వైద్య సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట.

అవసరమైతే ధరించాలి
కరోనా టైమ్ లో మాస్క్ లు తప్పనిసరి చేయడంతో ఆస్పత్రుల్లో మెడికల్ స్టాఫ్ ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు మాస్కులు అడ్డంకిగా మారాయట. అదే సమయంలో మాస్క్ ల వల్ల ఊపిరి తీసుకోవడంలోనూ చాలా మంది ఇబ్బంది పడ్డారట. మొత్తానికి ఇప్పుడు మాస్క్ ల గొడవైతే లేదు. కరోనా మహమ్మారి పీడ విరగడవడంతో మాస్క్ లు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిన బాధ పోయింది. కానీ తిరిగి కొవిడ్ లేదా అలాంటి మహమ్మారి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం. అలాంటి పరిస్థితే వస్తే మాస్క్ లు వేసుకోవడానికి ప్రజలు వెనుకాడొద్దని.. తమ ఆరోగ్యంతో పాటు ఇతరుల హెల్త్ ను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -