Thursday, September 19, 2024

పంటి సమస్య పెరిగే ఛాన్స్.. ఈ టిప్స్‌తో కంట్రోల్!

Providing Dental Care for Seniors: Strategies and Solutions for Dental Concerns

Must Read

శరీర సౌందర్యం అనగానే అందరూ ముఖం అందంగా ఉంటే చాలని అనుకుంటారు. ముఖం కాంతివంతగా ఉండి, బాడీ ఫిట్ గా సరిపోతుందని భావిస్తారు. కానీ శరీర సౌందర్యం అంటే దంతాలు కూడా బాగుండాలని అర్థం చేసుకోరు. పంటి వరస బాగుండి, వాటిపై ఎలాంటి గార లాంటిది ఏర్పడకుండా అవి మెరుస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. దంతాలు బాగున్న వారు నవ్వితే చూడటానికి మరింత అట్రాక్టివ్ గా ఉంటారు. అందుకే దంత ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం తప్పనిసరి అని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

మనం పుష్టిగా ఆహారాన్ని తీసుకోవడంలో పళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దంతాలతో ఆహారాన్ని నమలకుండా తింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దంతాలను హెల్తీగా ఉంచుకోవాలని, అందుకోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తన్నారు. ఈ రోజుల్లో చిన్నా, పెద్దలనే తేడాల్లేకుండా పంటి సమస్య చాలా మందిని వేధిస్తోంది. దంతాల సమస్య నోటిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ మధ్య కాలంలో చిన్నారులకు పంటి సమస్యలు అధికంగా వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి దంత సమస్యల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

ఆ పదార్థాలకు దూరం

పళ్లకు అంటుకుపోయే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిల్లో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. పళ్లకు అంటుకున్న పదార్థాలు ఓ పట్టాన పోవు. కాబట్టి చాక్లెట్లు లాంటివి తిన్నప్పుడు అవి అంటుకుపోతే దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.

గమ్

చూయింగ్ గమ్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. దీన్ని తింటే ముఖ కండరాలకు వ్యాయామం కలుగుతుంది. ఇది రక్త ప్రసరణను పుంజుకునేలా చేస్తుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే చూయింగ్ గమ్ లోని షుగర్ దంతాలను దెబ్బతీస్తుంది. కాబట్టి షుగర్ లెస్ గమ్ ను నమలడం మేలు. ఇలా చేయడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. ఇది దంతాలను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతుంది.

పొట్ట ఆరోగ్యానికీ చేటు

ప్రమాదాల బారిన పడటం లేదా వృద్ధాప్యం వల్లో కొందరి నోట్లోని దంతాల సంఖ్య తగ్గిపోవచ్చు. దీని వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలలేని పరిస్థితి. సరిగ్గా నమలకపోతే తిన్న ఆహారం జీర్ణమవదు. దీంతో పోషకాల కొరతతో పాటు పొట్టలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

పుక్కిలించడం

ఆహారం తిన్న ప్రతిసారీ నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. దీంతో దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. అలా చేయకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.

నీళ్లు

నీరు అమృతం అనే విషయం తెలిసిందే. మానవ మనుగడలో ఎంతో కీలకంగా చెప్పుకునే నీరు తాగితే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. నోరు తడారకుండా చూసుకోవడంలో నీళ్లు చాలా ముఖ్యం. ఇది పళ్లకూ మేలు చేస్తుంది.

తక్కువగా తినాలి

ద్రాక్ష, పైనాపిల్, నిమ్మ, దానిమ్మ లాంటి పుల్లటి ఫ్రూట్స్ హెల్త్కు ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలో ఉండే ఆమ్లంతో దంతాల మీది ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పళ్లను మితంగా తీసుకోవాలి. ఇవి తిన్నాక వెంటనే కాకుండా అరగంటయ్యాకే పళ్లు తోముకోవాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -