Thursday, September 19, 2024

హార్మోన్ల అసమతుల్యతకు ఈ 7 రకాల ఫుడ్స్‌తో చెక్!

"Balance your hormones with these 7 foods!"

Must Read

హార్మోన్ల సమతుల్యత కోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది, ఫలానా డైట్ ను పాటిస్తే చాలు అనేది వినే ఉంటారు. కానీ నిజంగా హార్మోన్ల బ్యాలెన్స్ కోసం ఏదైనా ఫుడ్ ఉందా అనే డౌట్ మీకు రావొచ్చు. అవును, ఇది నిజమే. శరీరంలో హార్మోన్లు మోతాదులో లేకపోతే వాటిని బ్యాలెన్స్ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మన శరీరంలో జీవక్రియ, పెరుగుదలతో పాటు పునరుత్పత్తి లాంటి పనుల్ని హార్మోన్లు చూసుకుంటాయి. అలాంటి కీలకమైన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

శరీరంలో హార్మోన్ల సంఖ్య తగ్గినా, పెరిగినా సమతుల్యత దెబ్బతింటుంది. మన జీవన విధానాన్ని బట్టి, రోజువారీ ఒత్తిళ్లు, ప్రెగ్నెన్సీ, తీసుకునే మెడిసిన్స్ మీద హార్మోన్ల సమతుల్యత ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ స్టైల్ బాగుంటే ఎలాంటి సమస్యే ఏర్పడదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా తగ్గడం
– బరువు పెరగడం లేదా తగ్గడం
– విరేచనాలు
– డిప్రెషన్ లేదా ఆందోళన

మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిందని కింది లక్షణాలను బట్టి అర్థం చేసుకోవాలి. అవేంటంటే..

మొటిమలు
– జుట్టు రాలడం
– రుతుచక్రం లేదా పీరియడ్స్ క్రమం తప్పడం

పురుషుల్లో శృంగారానికి సంబంధించి హార్మోన్లు అసమతుల్యంగా ఉన్నాయా లేదో కూడా తెలుసుకోవచ్చు. శరీరంలోని వెంట్రుకల సంఖ్య తగ్గిపోవడం, అంగస్తంభన లోపం, శృంగారంపై ఆసక్తి పోవడాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఉందని అర్థం చేసుకోవాలి.

హార్మోన్ల అసమతుల్యతను తగ్గించే మార్గాలు
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సహజ పద్ధతుల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీని కోసం నిపుణులు సూచిస్తున్న పలు సలహాలు ఇవే..

– ఒత్తిడిని తగ్గించుకోవడం
– సరైన నిద్ర
– వ్యాయామం
– హెల్తీ డైట్ ను తీసుకోవడం

హార్మోన్ల అసమతుల్యతకు ఉపయోగపడే ఫుడ్స్

చియా సీడ్స్
చియా సీడ్స్ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ హార్మోన్ బ్యాలెన్స్ కు ఎంతగానో దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆలివ్ ఆయిల్
హార్మోన్ల ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ కావాలంటే శరీరంలోకి కొవ్వు చేరాలి. అయితే ఇది హెల్తీ ఫ్యాట్ అయి ఉండాలి. అలాంటి ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం వంటలో ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వాడాలి.

సాల్మన్ చేప
హార్మోన్ల ఉత్పత్తిలో కీలకంగా ఉండే కొలెస్ట్రాల్ శరీరంలో చేరాలంటే సాల్మన్ చేప లాంటి వాటిని తీసుకోవాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ లో ముఖ్య భూమిక పోషిస్తుంది.

కూరగాయలు
హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి కొన్ని రకాల కూరగాయలు బాగా దోహదపడతాయని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. బ్రొకోలి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కాయగూరల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఆకుకూరలు
విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే బచ్చలికూర లాంటి కొన్ని ఆకుకూరలు తీసుకంటే హార్మోన్ల అసమతుల్యత సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

చిలగడ దుంపలు
ఫైబర్, పొటాషియంతో పాటు విటమిన్ ఏ మెండుగా ఉండే చిలగడ దుంపలు తీసుకోవడం హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

బ్రాజిల్ నట్స్
న్యూట్రియన్స్, సెలీనియం, మినరల్స్ పుష్కలంగా ఉండే బ్రాజిల్ నట్స్ హార్మోన్స్ ఉత్పత్తిలో కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీవక్రియను కూడా నియంత్రిస్తాయని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -