Thursday, September 19, 2024

బంగారం ఇప్పుడు కొనొచ్చా? లేదా ఆగాలా?

Gold Rates Outlook

Must Read

పసిడి ఇష్టపడే మహిళలకు గుడ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ రేట్స్ వరుసగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా ఏకంగా 7 నెలల కనిష్టానికి పసిడి ధరలు పడిపోవడం విశేషం. ఇంటర్నేషనల్ మార్కెట్ సిచ్యువేషన్స్ కు అనుగుణంగా దేశంలో మరోమారు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం (అక్టోబర్ 3వ తేదీ) గోల్డ్ రూ.600 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.660 తగ్గి.. రూ.57,380కి చేరుకుంది.

ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గి.. రూ.52,600 పలుకుతోంది. సిల్వర్ కూడా గోల్డ్ బాటలోనే ప్రయాణిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు తగ్గింది. దీంతో మార్కెట్ లో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.73,500కు చేరుకుంది. భారత్ లోని బంగారం ధరల్ని గమనిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,530గా ఉంది. అదే ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.57,380గా ఉంది. కోల్ కతాలో 140 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,380 పలుకుతోంది.

వరల్డ్ వైడ్ గా అధిక ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి వడ్డీ రేట్ల కారణంగా హైదరాబాద్ సహా ఇతర సిటీల్లో గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. అమెరికన్ డాలర్ విలువ, బాండ్ ఈల్డ్ లు పెరగడంతో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే సంకేతాలు అందుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు మరింతగా పడిపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ధర ఔన్స్ కు దాదాపు 20.77 డాలర్ల వద్ద ఉంది. గోల్డ్ రేట్స్ ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయని పలు నివేదికలు చెబుతున్నాయి. పండుగల టైమ్ లో బంగారం, వెండి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశమని చెప్పొచ్చు. ఎందుకంటే గత పది రోజుల్లోనే బంగారం ధర తులంపై ఏకంగా రూ.4 వేల వరకు దిగొచ్చింది.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -