Sunday, April 13, 2025

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం.. బుకింగ్స్ నిలిపివేత

Must Read

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో తీసుకొచ్చిన జిమ్నీ 5డోర్ వేరియంట్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. జనవరి 30 నుంచి ప్రారంభించిన బుకింగ్‌లు.. ఏప్రిల్ 3నుంచి డెలివరీలు అందిస్తామని పేర్కొంది. 4 రోజుల్లోనే 50వేల బుకింగ్‌లు వచ్చాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, వెయిటింగ్‌ పీరియడ్‌ పెరగడంతో బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ వెల్లడించలేదు.

జపాన్‌లో మారుతీ జిమ్నీ స్పీడ్‌ మాన్యువల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.14.88 లక్షలు, ఏటీ వెర్షన్‌ ధర రూ.15.43 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో వీటి ధరలు రూ.12.74 లక్షలు, రూ.14.79 లక్షలుగా ఉన్నాయి. మహీంద్రా థార్‌ రాక్స్‌, ఫోర్స్‌ గుర్ఖా వంటి 5 డోర్‌ ఎస్‌యూవీలకు జిమ్నీ పోటీ ఇస్తోంది. ఇక ఈ ఎస్‌యూవీ ఫీచర్ల విషయానికొస్తే.. 1.5 లీటర్‌, 4- సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వచ్చింది. 105 హెచ్‌పీ శక్తిని, 134 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, 4-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను పొందుపర్చారు. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌కు 16.94 కి.మీ., అదే ఆటోమేటిక్ వేరియంట్‌ లీటర్‌కు 16.39 కి.మీ. మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 5 డోర్లతో వస్తున్న ఈ కారుకు 210ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -