దక్షిణ భారత దేశం మొత్తం చుట్టి రావడానికి ఐఆర్ సీటీసీ కొత్త టూర్ ప్రాకేజీని ప్రవేశపెట్టింది. ఆలయాల దర్శన కోసం విశాఖ నుంచి ప్రాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో త్రివేండ్రం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం లాంటి ప్రాంతాలను ఆరు రోజుల్లో చూడవచ్చు. దీని కోసం జనవరి 21 నుంచి ఈ ప్యాకేజీని ప్రకటించారు. హోటల్ లో ఆహారం, ఫ్లైట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మిగిలినవి కవర్ కావని పేర్కొన్నారు. ముందుగా విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరుతుంది. మదురైలో మధ్యాహ్నం వరకు చేరుకుంటుంది. మీనాక్షి అమ్మన్ ఆలయ దర్శనం చేసుకోవాలి. రెండో రోజు రామేశ్వరంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మూడో రోజు రామేశ్వరం సందర్శనం అనంరం కన్యాకుమారికి ప్రారంభం అవుతారు. నాల్గొవ రోజు సూర్యోదయం చూసి కన్యాకుమారి ముగించుకుని సాయంత్రం త్రివేండ్రం వెళ్తారు. ఐదవ రోజు త్రివేండ్రంలోనే ఉండాలి. ఆరవ రోజు త్రివేండ్రం నుంచి విశాఖపట్నం చేరుకునేలా ఈ టూర్ మ్యాప్ ను తయారు చేశారు.