మూడో వన్డే వరల్డ్ కప్ కు గడ్డుకాలమేనా?
రోహిత్ శర్మ ఫాంపై ఆందోళన .. కొద్ది రోజులుగా రోహిత్ శర్మ ఫాంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కీలక మ్యాచుల్లో రాణించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే వచ్చే ఏడాది ప్రపంచ వన్డే వరల్డ్ కప్ ఉండడం, ఈక్రమంలో టీమిండియా ఫాం కోల్పోవడం ఫ్యాన్స్ లో నిరాశ కలిగిస్తోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ పర్వాలేదు అనిపిస్తున్నా.. వ్యక్తిగతంగా రాణించలేకపోతున్నాడు.
వరుస ఓటములు..
ఇటీవల టీ20 వరల్డ్ కప్ ను భారత్ చేజేతులా జార విడుచుకుంది. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా ఆట తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ముందు ఆసియా కప్ లోనూ భారత్ ఓడిపోయింది. వరుసగా రెండు ప్రధాన సిరీస్ లు కోల్పోవడం పట్ల యావత్ భారత్ దిగ్భాంతికి గురైంది. ఈక్రమంలో న్యూజిలాండ్ తో ఆడిన వన్డే సిరీస్ లోనూ భారత్ ఓటమి చవిచూసింది. దీంతో రోహిత్ కెప్టెన్ పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఓవైపు పరుగులు చేయకపోవడం మరోవైపు కెప్టెన్సీలో రాణించలేకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పసికూన అయిన బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ లోనూ తొలి మ్యాచ్ భారత్ ఓడిపోయింది. ఫీల్డింగ్ వైఫల్యం కళ్లకు కట్టునట్లుగా కనిపించింది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 2023 వరల్డ్ కప్ లోనూ భారత్ గెలుస్తుందో లేదోనన్న సంశయం నెలకొంది.
నెలదొక్కుకుంటారా?
కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా వరుస ఓటములు ఆయన పని తనాన్ని తెలియజేస్తున్నారు. కీలక నిర్ణయాల్లో రాణించలేకపోతున్నాడనే అపవాదు ఉంది. మరోవైపు రోహిత్ శర్మ అధిక పరుగులు చేయడం లేదు. ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లోనూ ప్రతిభకనబర్చలేదు. 2019 అనంతరం రోహిత్ శర్మ 76 తప్ప పెద్దగా స్కోర్ ఏమీ చేయలేదు. ఫిట్ నెస్ విషయంలోనూ రోహిత్ శర్మ వీక్ గా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఉన్నంత చురుకుదనం అతనిలో కనిపించడం లేదు. కెప్టెన్సీ మార్చకపోతే 2023 వన్డే వరల్డ్ కప్ కష్టమేనని కొందరు క్రికెట్ నిపుణులు చెబుతుండగా.. అప్పటివరకు రోహిత్ శర్మ కుదురుకుంటారని కొందరు చెబుతున్నారు. మరికొందరు టీం సభ్యులను మొత్తం ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా రాబోయే వరల్డ్ కప్ భారత్ కు కీలకంగా మారింది.