కలియుగం అంతం దగ్గర్లోనే ఉందా? మానవజాతి అంతరించి పోతుందా? ఈ విశ్వ వినాశనం తప్పదా? నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మగవాళ్లలో క్రోమోజోముల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విషయానికొస్తే.. పిండం ఏర్పడడానికి ముఖ్యమైన క్రోమోజోములు మగ వారిలో తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పిండంలో ఆడ, మగ అనేది గుర్తించే ‘వై’ క్రోమోజోములు సైతం అంతరించిపోతున్నాయని కనుగొన్నారు. ఇదే జరిగితే పిండం ఏర్పడక.. మనుషులు పుట్టే అవకాశం ఉండదు. ఇదే కొనసాగితే.. మానవాళికి అంతం తప్పదు. అయితే ఇదే క్రమంలో ‘వై’ క్రోమోజోములు అంతమైనప్పటికీ ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిని కనిపెట్టేందుకు ‘స్పైనీ’ ఎలుకపై ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. ‘వై’ క్రోమోజోములు అంతరించి పోయినా ఇతర వ్యవస్థ రూపుదిద్దుకోవడం శుభపరిణామమనే చెప్పాలి.