హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఒంటరితనం మరియు తీవ్ర మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బక్కశెట్టి సింధూజ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన సింధూజ హైటెక్ సిటీలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ మియాపూర్ లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివసిస్తున్నారు. 2015లో వివాహం జరిగిన తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఆమె గురువారం ఉదయం తన ఫ్లాట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందారు.
సహోద్యోగి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఫ్లాట్ కు వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో పోలీసులు గుర్తించిన సూసైడ్ నోట్ లో గత నాలుగు నెలలుగా ఒంటరితనం మరియు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను అనాథ పిల్లలకు అందించాలని మరియు తన ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్ కు చెందేలా చూడాలని ఆమె తన లేఖలో కోరారు.

