తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరియు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ పర్యటించి నాటకీయ వాతావరణంలో చాయ్ తాగుతూ ఫోటోలకు పోజులిచ్చి ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారని విమర్శించారు. కానీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఒక కల్పిత కథగా మిగిలిపోయిందని మరియు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల నమ్మకాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు.
ఉద్యోగాల కల్పన అనేది ఫోటోషూట్ లేదా పీఆర్ స్టంట్ కాదని ఒక్క ఉద్యోగం ఇవ్వాలన్నా దార్శనికత మరియు అంకితభావం అవసరమని కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ యువత కోసం ఏమీ చేయలేమని రాహుల్ గాంధీ మరియు ఆయన బృందం పదేపదే నిరూపించుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన యువత కాంగ్రెస్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు మళ్లీ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని మరియు ఈ మోసాన్ని ఎన్నటికీ మర్చిపోరని ఆయన హెచ్చరించారు.

