Wednesday, November 18, 2026

క్రీడలపై సీఎం రేవంత్ మాటలు.. హరీశ్ రావు విమర్శలు

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల విషయంలో అంతర్జాతీయ స్థాయి మాటలు చెబుతూ క్షేత్రస్థాయిలో క్రీడాకారుల సమస్యలను పూర్తిగా విస్మరించారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలోని క్రీడాకారులకు కనీసం కోచ్లను కూడా నియమించకపోవడం దారుణమని అన్నారు. సీఎం తన సొంత ఫుట్ బాల్ సరదాల కోసం 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని కానీ క్రీడల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల్లో ఖాళీగా ఉన్న పీఈటీ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు నగదు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. క్రీడా బడ్జెట్ను పెంచి గ్రామీణ క్రీడాకారులకు ప్రయాణ వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

భారత్ లో తొలి స్వదేశీ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఆవిష్కరణ

దేశంలోని కోళ్ల పరిశ్రమను బర్డ్ ఫ్లూ ముప్పు నుంచి రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హెచ్5ఎన్1 వ్యాక్సిన్ ను నవంబర్ 20వ తేదీన అధికారికంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -