వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్ హత్యపై పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర నేత కాసు మహేష్ రెడ్డి తెలిపారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం అందేవరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని, వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్ సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుందని చెప్పారు. హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వ మారిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాసు మహేష్ హెచ్చరించారు.

