Sunday, January 18, 2026

భారత్‌పై సుంకాలు విధించ‌డం త‌ప్పు – రిపబ్లికన్‌ నేత విమర్శలు

Must Read

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో దేశాలపై విధిస్తున్న సుంకాల‌పై విమర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన రిచ్ మెక్‌కార్మిక్ ట్రంప్ పాలసీలపై చర్చలో భారతదేశంతో త‌ప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. “భారత్ అమెరికాకు పెట్టుబడులు తీసుకు వస్తుంది. పాకిస్తాన్‌ నుండి ఏం వస్తుందో చూడాలి. భారత్ తన ప్రతిభతో అమెరికాకు లాభాలు ఇస్తోంది. కానీ, భారత్‌ను దూరం చేయడం పెద్ద సమస్య” అని అన్నారు. అమెరికాలో భారత ప్రతిభావంతులెంత మంది ఉన్నారో అమెరికా తెలుసుకోవాల‌ని సూచించారు. భార‌త‌ ప్రధాని మోడీ జాతీయవాది అని చెప్పారు. భారత్ చౌకైన ఇంధనంతో ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి రష్యన్ చమురును కొనుగోలు చేస్తుంద‌ని, ఇదే కారణంగా అమెరికా భార‌త్‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. ఇక మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మాట్లాడుతూ.. యూఎస్ కంపెనీలు పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని, అయితే భారత్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు. పాక్‌తో సంబంధాలు బలపడినా, ఆ దేశంలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని ఆయన చర్చించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సంగారెడ్డి నుంచి జీవితంలో పోటీ చేయ‌ను – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని ప్రకటించారు. సంగారెడ్డి ప్రజలు, ముఖ్యంగా ఇక్కడి మేధావులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -