అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ నవంబర్ 19న నార్త్ కరోలినాలోని క్యాంప్ లెజ్యూన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంలో తీసిన ఫోటోల్లో ఆమె వివాహ ఉంగరం ధరించకపోవడం గమనార్హం. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో పక్కపక్కనే ఉన్న ఫోటోల్లోనూ ఉంగరం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో విడాకుల పుకార్లు మళ్లీ బలంగా వ్యాప్తి చెందాయి. గత నెలలో జేడీ వాన్స్ “నా భార్య ఇంకా క్రైస్తవ మతంలోకి మారలేదు… ఒకరోజు మారుతుందని ఆశిస్తున్నా” అని చెప్పిన వ్యాఖ్యలు, అదే కార్యక్రమంలో ఆయన ఎరికా కిర్క్‌ను గట్టిగా కౌగిలించుకోవడం, ఎరికా “నా భర్తను జేడీ వాన్స్‌లో చూస్తున్నాను” అని అనడం ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అయితే ఉషా వాన్స్ సన్నిహిత వర్గాలు ఈ పుకార్లను ఖండిస్తూ… “వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు ఉంగరం తీసి మర్చిపోతుంటారు… అంతే” అని స్పష్టం చేశాయి.

