సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ఐబొమ్మ రవిపై ఫోర్జరీ సహా మరో మూడు సెక్షన్లు జోడించారు. దీనితో మొత్తం 13 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డు, బైక్ లైసెన్సు, ఆర్సీ తయారు చేసినట్టు గుర్తించారు. ఐదు రోజుల పోలీసు కస్టడీలో రవిని తీవ్వారు. బ్యాంకు లావాదేవీలు, క్రిప్టో వాలెట్లు, విదేశీ భాగస్వాములు, నెదర్లాండ్స్ సర్వర్లు, హార్డ్ డిస్క్ డేటా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వంటి అంశాలపై లోతైన విచారణ జరిగింది. ఎథికల్ హ్యాకర్ల సాయంతో డేటా అనాలిసిస్ కొనసాగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న రవిని, ఉచితంగా వాదించి బయటికి తీసుకొస్తానని సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఉంటున్న రవి తండ్రిని కలిసి సంతకాలు చేయమని కోరారు. తన ఆరోగ్యం సహకరించడంలేదని, కోర్టుల చుట్టూ తిరగలేని, సంతకం చేసేందుకు రవి తండ్రి అప్పారావు నిరాకరించారు.

