Thursday, November 20, 2025

ప‌దోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్

Must Read

బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా గాంధీ మైదానంలో జరిగిన భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేశారు. 243 సీట్లలో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 89, జేడీయూ 85, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 19 సీట్లు సాధించాయి. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 35 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం పాలైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాపులే సీఎంలను నిర్ణయిస్తార‌న్న అంబ‌టి రాంబాబు!

1989 కాంగ్రెస్, 2024 చంద్రబాబు గెలుపున‌కు కాపులే కారణమని వైసీపీ నేత‌ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రేపల్లెలో జరిగిన కాపు కార్తీక సమారాధన సమావేశంలో మాజీ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -