Monday, June 1, 2026

విజయవాడలో గంజాయి మాఫియా

Must Read

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ ప్రాంతాల్లో గంజాయి సేవ బహిరంగంగా జరుగుతోంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నప్పటికీ చర్యలు లేవని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ను ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు, బండ్ల సీటు కవర్లు కోసేయడం జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. రాత్రి సమయాల్లో గుంపులుగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నివాసితులు, విద్యార్థులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నైట్ రౌండ్స్ సక్రమంగా చేయడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గంజాయి మాఫియాపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -