మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని ప్రకటించారు. మంచి సినిమాలు, జీవితం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని, కొత్త సంవత్సరంలో ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నానని అన్నారు. రాబోయే చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై మంచి నమ్మకం ఉందని, వచ్చే ఏడాది సంబరాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. పాన్-ఇండియా స్థాయి ఈ ఆక్షన్ ఎంటర్‌టైనర్‌ను రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. గ్లింప్స్‌లోని డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

