ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15 రోజుల ముందు సైకాలజీ విభాగంలో ర్యాగింగ్‌కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. అర్ధరాత్రి హాస్టల్‌లో జూనియర్లను గంటల తరబడి నిల్చోబెట్టి వికృత చేష్టలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వర్సిటీకి చేరుకుని ఇంటరాక్షన్ క్లాసులు మాత్రమేనంటూ సీనియర్లు హాస్టల్ సిబ్బంది మాయ మాటలు చెప్పారు. శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

