Wednesday, November 19, 2025

బెట్టింగ్‌లో నష్టాలతో యువకుడు ఆత్మహత్య

Must Read

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బెట్టింగ్ ఆటల్లో లక్షల రూపాయలు కోల్పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్ (31) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పట్టణంలోని హోటల్‌లో గది తీసుకున్నాడు. తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపాడు. ఇంటికి రా, అన్నీ మాట్లాడుకుందాం, బాధపడకు అని తండ్రి సలహా ఇచ్చాడు. గది తలుపులు చాలాసేపు తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడగా అఖిల్ ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -