అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు నిరసన చేపట్టగా, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కేతిరెడ్డికి తాడిపత్రి కాకుండా ఇతర మండలంలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ నిర్ణయంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి మార్చారు. అక్కడ నిరసన చేపట్టి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యాడికికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు కొంతసేపు అడ్డుకున్నారు. తాడిపత్రిలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీల మధ్య పోటీ కొత్త కాదు. తాజా ఘటనలతో రెండు వర్గాల మధ్య రాజకీయ ఉత్కంఠ గరిష్ఠ స్థాయికి చేరింది.

