జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ కేసులు నమోదు చేశారు. అనధికారికంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించామని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు స్పందించడం లేదని, ఎన్నికలు సజావుగా జరిపే బాధ్యత వారిదేనని పేర్కొన్నారు.

