శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. సాంకేతిక లోపాలతో అధికారులు సర్వీసులను నిలిపివేశారు. ఢిల్లీ ముంబై శివమొగ్గ విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్-కౌలాలంపూర్ వియత్నాం-హైదరాబాద్-గోవా సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపాలతో విమానాలు ఆలస్యమవుతున్నాయి. 24 గంటల్లో 800 విమానాలు ఆలస్యం అయ్యాయి. 26 విమానాలు రద్దు చేశారు. ఆటోమేటెడ్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్‌లో సమస్యలు కారణమని తెలిసింది. అధికారులు సాంకేతిక లోపాలను సరిచేస్తున్నారు. పూర్తి సాధారణ స్థితికి కాస్త సమయం పడుతుందని చెప్పారు.

