ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనకు బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తర్వాత మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఎర్రచందనం గోడౌన్లను తనిఖీ చేస్తారు. మంగళం ప్రాంతంలోని నిల్వ గోదాములను సందర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని సూచిస్తారు. శేషాచల కొండల్లో అరుదైన వన్యప్రాణులు వృక్షసంపదను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇస్తారు.

