ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. అక్టోబర్ 11న టెండర్లు ఆహ్వానించి, 31వ తేదీ వరకు గడువు ఇచ్చినా, తాజాగా రద్దు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివాదాలు లేదా టెండర్లు రాకపోవడమే కారణమా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

