ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి తదితర 12 కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ముగ్గురు అనధికారిక వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది డాక్యుమెంట్ రచయితలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అనధికారిక నగదు, సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగి, తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు.

