Saturday, June 13, 2026

ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ వర్ష సూచన

Must Read

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం నాటికి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అని నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కాకినాడ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -