Friday, January 16, 2026

కర్నూలు ప్రమాదం.. మొబైల్ ఫోన్ల పేలుడుపై చ‌ర్చ‌

Must Read

కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. బస్సు బైక్‌ను ఢీకొనగా, బైక్ ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ కారడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్‌లోని మొబైల్ ఫోన్లకు వ్యాపించి, బ్యాటరీలు పేలాయి. దీంతో ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు మంటలు వ్యాపించి, ముందు భాగంలోని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. డ్రైవర్ బస్సును నిలిపి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -