తమిళనాడులో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఒక వారంలో ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. 2026లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గతంలో ప్రకటించారు. బిహార్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. అయితే, బిహార్‌లో ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారని, ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు ఆరోపించాయి.

