టీటీడీ పరకామణి కేసులో ముఖ్య పరిణామం జరిగింది. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి సీఐడీ అధికారులు అందజేశారు. తదుపరి విచారణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ కి 20 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. టీటీడీ ఈవో నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. టీటీడీ తరపు న్యాయవాది కోరడంతో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్ 19న కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన టీటీడీ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.