Monday, October 20, 2025

టీడీపీలో వ‌ర్మ‌ వివాదం ముగిసిందా?

Must Read

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ ఈ వివాదాన్ని సృష్టించిందని మంత్రి నారాయణ తోసిపుచ్చారు. విశాఖ పర్యటనలో వర్మ మంత్రి నారాయణను కలిసి వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టెలీకాన్ఫరెన్స్ మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడని వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగమంటే ఆగుతాను దూకమంటే దూకుతాను అని వర్మ ప్రకటించారు. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై అభూతకల్పనలు ప్రచారం చేశారని వర్మ అన్నారు. పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారాలను పట్టించుకోను అని వర్మ స్పష్టం చేశారు. టీడీపీలో తాను పిల్లర్ లాంటి వాడిని అని వర్మ అన్నారు. మంత్రి నారాయణ జనసేన, టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని వర్మ వెల్లడించారు. కూటమి మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి వల్లా కాదు అని వర్మ స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -