Tuesday, October 21, 2025

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏపీ దేశంలోనే టాప్!

Must Read

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలల సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 12,912 ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 1,04,125గా ఉండగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఆధారంగా రాష్ట్రాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ (12,912) తర్వాత ఉత్తరప్రదేశ్ (9,508), జార్ఖండ్ (9,172), మహారాష్ట్ర (8,152), కర్ణాటక (7,349), లక్షద్వీప్ (7,217), మధ్యప్రదేశ్ (7,217), పశ్చిమ బెంగాల్ (6,482), రాజస్థాన్ (6,117), ఛత్తీస్‌గఢ్ (5,973), తెలంగాణ (5,001) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల కొరతను సూచిస్తోందని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -