Tuesday, October 21, 2025

కొండెక్కుతున్న‌ బంగారం, వెండి ధరలు!

Must Read

భారతదేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు తమ బంగారు ఆభరణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా రోడ్డుపై, రద్దీగా ఉండే మార్కెట్లలో లేదా జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, ఇంట్లో ఉన్న విలువైన బంగారు వస్తువులను సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలని, దొంగతనాల నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,280 పెరిగి రూ. 1,28,680కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,000 పెరిగింది. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర రూ. 4,000 పెరిగి రూ. 2,06,000కి చేరుకుంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో పౌరులు తమ విలువైన ఆస్తుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -