Tuesday, October 21, 2025

వాడరేవు సముద్ర తీరంలో విషాదం!

Must Read

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో జరిగిన ఒక దుర్ఘటనలో సముద్ర అలలు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థుల బృందం వాడరేవు బీచ్‌కు వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్, సోమేష్, గౌతమ్ అలల తాకిడికి కొట్టుకుపోయారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వెంటనే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్, చీరాలకు చెందిన గౌతమ్‌లు ఇంకా గల్లంతయ్యారు. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఘటనా స్థలిని సందర్శించి, మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం అగ్నిమాపక, మత్స్యశాఖ అధికారులు డ్రాగన్ లైట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -