దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో అమోఘమైన ముద్రవేసిన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైయస్ఆర్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, అనుచరులు, పార్టీ నాయకులు కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్‌కు చేరుకున్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలు వేసి నిమిషం మౌనంగా నిలిచి నివాళులు అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సతీమణి వైయస్ విజయమ్మ, కోడలు వైయస్ భారతి, కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొని వైయస్ఆర్ సేవలను స్మరించుకున్నారు.