Tuesday, October 21, 2025

నాన్న‌ అస్థికలు భారత్‌కు తీసుకురండి – అనితా బోస్

Must Read

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంలో, స్వాతంత్య్ర‌ సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ పాఫ్ కీలక విజ్ఞప్తి చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆమె మోదీని కోరారు. ఇప్పటికే పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె, వయసు రీత్యా ఇప్పుడు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. నేతాజీ అస్థికలు భారత్‌కు చేరుకోవడం తనకే కాకుండా దేశానికి సంబంధించిన విషయం అని, ఈ సమస్యను తన తరాలపై భారంగా మిగల్చాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు. జపాన్ ఎల్లప్పుడూ నేతాజీకి గౌరవం ఇచ్చిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని కొన్ని కమిషన్‌లు తేల్చగా, జస్టిస్ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని కమిషన్ మాత్రం ఆ వాదనను తిరస్కరించింది. ప్రమాదం తర్వాత కూడా నేతాజీ జీవించి ఉన్నారని తెలిపింది. దీంతో రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన అస్థికలు నిజంగా నేతాజీవేనా అన్న సందేహం ఇంకా స్పష్టతకు రాలేదు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -