Saturday, August 30, 2025

శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో దుర్ఘటన

Must Read

హైదరాబాద్‌ రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్ర సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుత‌ను కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన శోభాయాత్ర అర్ధరాత్రి సమయంలో యాదవ సంఘం వద్దకు చేరింది. ఈ సమయంలో రథాన్ని లాగుతున్న జీప్ ఆగిపోవడంతో నిర్వాహకులు చేతులతో రథాన్ని నెట్టారు. కొద్దిసేపటికే రథం పైభాగం హైటెన్షన్ వైర్లను తాకడంతో కరెంట్ షాక్ తగిలి విషాదం సంభవించింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆశ్చర్యకరంగా, రథంపై ఉన్న పూజారి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అల్లు అరవింద్‌కు మాతృవియోగం

ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -