Saturday, August 30, 2025

సుంకాల పెంపు వాయిదా వేసిన ట్రంప్

Must Read

రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన నిర్ణయంలో కొంత సడలింపు చూపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక సమావేశం అనంతరం ఈ అంశంపై పునరాలోచన చేస్తానని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయాలనే లక్ష్యంతో అలాస్కాలో జరిగిన ఈ భేటీ రెండున్నర గంటల పాటు సాగింది. ఒప్పందం కుదరకపోయినా సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసిందని ట్రంప్ పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతానికి సుంకాలపై వెంటనే నిర్ణయం తీసుకోవడం అవసరం అనిపించడం లేదు. రెండు మూడు వారాల్లో మళ్లీ పరిశీలిస్తాను” అని వెల్లడించారు. ఇటీవల భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తోందన్న కారణంతో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. పుతిన్‌తో చర్చలు అనుకున్న విధంగా సాగకపోతే భారత్‌పై సుంకాలు మరింత పెరగవచ్చని అమెరికా వాణిజ్య మంత్రి కూడా హెచ్చరించారు. అదేవిధంగా, ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే రష్యాపైనా 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. అయితే పుతిన్‌తో తాజా సమావేశం అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై తక్షణ సుంకాలు ఉండకపోవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అల్లు అరవింద్‌కు మాతృవియోగం

ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -