Monday, January 26, 2026

డిసెంబర్‌లోపు తెలంగాణకు కొత్త సీఎం

Must Read

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని ఆయన మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఏలేటి, “రేవంత్ రెడ్డి నువ్వు ఒక బచ్చా… ప్రధాని నరేంద్ర మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా మీ అధిష్టానానికి చేరింది. నీ పదవి పోతుందంటూ మీ సొంత ఎమ్మెల్యేలే చెబుతున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలు త్వరలోనే మార్పును చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే నెలల్లో తెలంగాణ రాజకీయ దిశ పూర్తిగా మారిపోతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, డిసెంబర్‌లో నిజంగానే నేతృత్వ మార్పు జరిగేనా అనే అంశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -