Tuesday, October 21, 2025

తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం – జాతీయ విద్యా విధానానికి స్వస్తి

Must Read

తమిళనాడు ప్రభుత్వం విద్యా రంగంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానంని రాష్ట్రంలో రద్దు చేస్తున్నట్టు సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. దీని స్థానంలో తమిళనాడుకు ప్రత్యేకంగా రాష్ట్ర విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. సీఎం స్టాలిన్ ప్రకటన ప్రకారం, కొత్త రాష్ట్ర విద్యా విధానంలో ద్విభాషా విధానాన్ని కొనసాగించనున్నారు. అంటే, విద్యార్థులకు తమిళం మరియు ఇంగ్లీష్ భాషలలోనే బోధనను ప్రధానంగా అందించనున్నారు. సైన్స్, ఇంగ్లీష్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇకపై రాష్ట్రంలోని ఉన్నత విద్యా ప్రవేశాలు 11, 12 తరగతుల మార్కుల ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నీట్‌ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలపై ఆధారపడే అవసరం తగ్గనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, ప్రాంతీయ భాష అభివృద్ధి, సైన్స్-టెక్నాలజీ నైపుణ్యాల పెంపుకే ఈ కొత్త విధానం దోహదం చేస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -