Monday, January 26, 2026

గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

Must Read

కడప జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న దాడులపై వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో కలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ బృందంలో ఉన్నారు. తరువాత మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. “గ్రామంలో పోలీసులు ఉన్నప్పటికీ నిర్లక్ష్య వైఖరి వల్లే దాడి జరిగింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేశాము” అని అన్నారు. డీఐజీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉపయోగించిన భాష పోలీసుల ధోరణిని చూపుతోందని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని, ఈసారి నిజాయితీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. “ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు” అని బొత్స స్పష్టం చేశారు. గవర్నర్ తమ ఫిర్యాదును శ్రద్ధగా విని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వైసీపీ నేతలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -