Monday, January 26, 2026

స్వీట్ మెమొరీస్ షేర్ చేసుకున్న రేణు దేశాయ్‌!

Must Read

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్, 19 ఏళ్ల వయసులోనే ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొద్ది చిత్రాల తరువాత సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబ జీవితం వైపు దృష్టి మళ్లించారు. పవన్ కళ్యాణ్‌తో వివాహం, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన రేణూ, విడాకుల తర్వాత పిల్లల పెంపకానికే ప్రాధాన్యం ఇచ్చారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే ఆమె, ఇటీవల తన 21 ఏళ్ల వయసులో తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పంచుకోవడంతో అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. 2023లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ద్వారా తిరిగి సినీ రంగంలోకి వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించి, స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమున్న వారికి సహాయం అందిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -