Tuesday, October 21, 2025

ఏపీలో సచివాలయ ఉద్యోగిని కిడ్నాప్‌

Must Read

అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని సౌమ్యను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం సమీపంలో విధుల్లో ఉన్న సౌమ్యను అకస్మాత్తుగా ఒక వాహనంలోకి లాగేందుకు దుండగులు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కత్తులతో బెదిరించి వారిని వెనక్కు నెట్టివేశారు. ఆ తర్వాత సౌమ్యను వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనతో తోటి ఉద్యోగులు, గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. కిడ్నాప్‌కు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. వ్యక్తిగత విభేదాలా? లేక వేరే ఉద్దేశ్యాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, అనుమానితుల జాడ కోసం విస్తృత గాలింపు చేపట్టారు. ఈ సంఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేలా ఈ ఘటన మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -