Saturday, August 30, 2025

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. “స్త్రీ శక్తి” పథకానికి శ్రీకారం

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు.

స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణం
ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘‘స్త్రీ శక్తి’’ పేరిట ప్రారంభమయ్యే ఈ పథకం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలులోకి వస్తుంది. ఏడాదిలో దాదాపు 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఆర్థిక పరిస్థితుల్లోనూ హామీల అమలు
ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నప్పటికీ, హామీలను అమలు చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మంత్రి పేర్కొన్నారు. మంత్రి లోకేష్‌ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించారని తెలిపారు.

ఇతర ముఖ్యమైన నిర్ణయాలు

  • ఐటీ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహంగా తక్కువ ధరకు భూములు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం
  • టూరిజం అభివృద్ధికి కొత్త రిసార్టులు, హోటళ్ల ఏర్పాటుకు అనుమతులు
  • అన్ని A4 మద్యం షాపుల్లో పర్మిట్ రూంలు ఏర్పాటు
  • రాష్ట్రంలోని 40,808 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ పాలసీ, సోషల్ మీడియా కవరేజీపై ప్రత్యేక విధానం రూపకల్పన
  • మావోయిస్టు పార్టీపై నిషేధం మరో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతి
- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -