Friday, August 29, 2025

జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా హ‌వా!

Must Read

భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల‌ను కేంద్రం ఆగస్టు 1న ప్రకటించింది. 2023 సంవత్సరానికి సెన్సార్ పొందిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నాయి. మొత్తం 7 విభాగాల్లో తెలుగు చిత్రాలు అవార్డులు దక్కించుకోవడం గర్వకారణంగా నిలిచింది. ఇక ఉత్త‌మ చిత్రంగా

ప్రధాన విభాగాలు…
ఉత్తమ చిత్రం – 12th ఫెయిల్
ఉత్తమ హిందీ చిత్రం – కతల్: ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ

నటన విభాగం
ఉత్తమ నటుడు – షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సీ (12th ఫెయిల్)
ఉత్తమ నటి – రాణి ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే)

తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డులు
తెలుగు సినిమాలకు మొత్తం 7 అవార్డులు లభించాయి.

ఉత్తమ తెలుగు చిత్రం – భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ, దర్శకత్వం: అనిల్ రావిపూడి)

ఉత్తమ యాక్షన్ దృశ్యాలు – హనుమాన్

ఉత్తమ ఏవీజీసీ విభాగం – హనుమాన్

ఉత్తమ గీత రచయిత – కాసర్ల శ్యామ్ (బాలగం – “ఊరు పల్లెటూరు…”)

ఉత్తమ నేప‌థ్య‌ గాయకుడు – పీవీఎన్ఎస్ రోహిత్ (బేబీ – “ప్రేమిస్తున్నా…”)

ఉత్తమ కథ (మూల కథ) – బేబీ (సాయి రాజేష్)

ఉత్తమ బాలనటి – సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు)

ఇతర భాషలలో ఉత్తమ చిత్రాలు

తమిళం – పార్కింగ్
మలయాళం – ఉల్లొ
కన్నడ – కందీలు: ది రే ఆఫ్ హోప్
మరాఠీ – శ్యామ్‌చి ఆఈ
బెంగాలీ – డీప్ ఫ్రిడ్జ్
ఒడియా – పుష్కర
గుజరాతీ – వాష్
అసోమీస్ – రంగతపు 1982
పంజాబీ – గోడ్డే గోడ్డే ఛా

సంగీతం – ఇతర విభాగాలు
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – జి.వి. ప్రకాష్ కుమార్ (వాఠి – తమిళం)
ఉత్తమ నేపథ్య సంగీతం – హర్షవర్ధన్ రమేశ్వర్ (అనిమల్)
ఉత్తమ మహిళా గాయని – శిల్పా రావు (జవాన్)
ఉత్తమ ఎడిటింగ్ – పూకలం (మలయాళం)
ఉత్తమ నిర్మాణ రూపకల్పన – 2018: ఎవ్రీవన్ ఇజ్ హీరో (మలయాళం)
ఉత్తమ ఛాయాగ్రహణం – కేరళ స్టోరీ

తెలుగు సినిమాలు ఏకంగా 7 అవార్డులు గెలుచుకోవడంతో సినీప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, కాసర్ల శ్యామ్, సాయి రాజేష్, పీవీఎన్ఎస్ రోహిత్, హనుమాన్ బృందం వంటి విజేతలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో విజేతలను అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -