Monday, January 26, 2026

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Must Read

దేశ‌ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు క‌ల‌క‌లం రేపాయి. నేడు ఉద‌యం నుంచి సుమారు 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని సమగ్ర తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు నేపథ్యంలో పాఠశాలల సిబ్బంది, విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించారు. కొన్ని పాఠశాలలు తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతుండగా, ఇది పక్కా పన్నాగమా లేక సరదాగా చేసిన పని అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురవకుండా ఉండేందుకు అధికారులు శాంతిభద్రతలు కట్టుదిట్టం చేశారు. అధికారిక వర్గాలు మరోవైపు అలాంటి ఇమెయిల్స్ వెనక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని సైబర్ ట్రాకింగ్ ద్వారా గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలో ఉంద‌ని, ప్రజలు ఊహాగానాలతో భయపడకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాల‌ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -