Sunday, August 31, 2025

ప్రముఖ నటి సరోజా దేవి మృతి.. ప్రముఖుల సంతాపం

Must Read

భారత సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో తన అద్భుత నటనతో కోట్లాది ప్రేక్షకులను కట్టిపడేసిన సరోజా దేవి ఎన్నో యుగాలకు గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటిస్తూ, “చలన చిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో ఆమె మరిచిపోలేని అనేక పాత్రలు పోషించారు. వారి లేని లోటు పూడ్చలేనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ, “ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి బి. సరోజా దేవి గారి మృతి ఎంతో విచారకరం. 200కు పైగా చిత్రాల్లో అగ్రనటుల సరసన నటించి మెప్పించిన ఆమె, సేవా దృక్పథంలోనూ పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -