తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులను తొలగించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికి , దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భగా బండి సంజయ్ మాట్లాడుతూ… టీటీడీలో 1000 మందికి పైగా ఇతర మతస్తులు ఉద్యోగులుగా ఉన్నారని,వాళ్ళను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలని పేర్కొన్నారు. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదని, వారికి స్వామి వారి మీద విశ్వాసం, భక్తి లేదని చెప్పారు. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేని వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారని, వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.